తమ రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత జులై 4 న చేసిన తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసారు. టి.డి.పి ఫోరం కన్వీనర్ ఇ.దయాకర రావు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ల బృందానికి నాయకత్వం వహించాడు. రాజీనామాలను ఆమోదించడానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట హామీని పొందడం గానీ…