సనాతన ధర్మం అంటే?

అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. క్రింద కవిత రూపంలో ఉన్న భాగం లేదా ప్రశ్న జవాబు రూపంలో ఉన్న భాగం వరకు మెసేజ్ గా వచ్చింది. సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక, కులాల కాలకూట విషంతో నిండిన, సమాజాన్ని పునరిద్ధరించాలని…

ఎక్కడ అసహనం, ఆయ్?

అసహనమా? ఏదీ చూపించు… చూపించు ఎక్కడో? ************ అమీర్ ఖాన్ అలా మాట్లాడుతున్నాడంటేనే భారత దేశం ఎంత సహన దేశమో చెప్పడానికి ఒక రుజువు అని హిందూత్వ అభిమాన గణం గొప్పలు పోతోంది. కానీ అమీర్ ఖాన్ మాటల్ని ‘ఎవరో ప్రభావంలో ఉండి మాట్లాటలు’ అనీ, ‘అయితే ఏ దేశం వెళ్తావో అదీ చెప్పు!’ అనీ ‘పాకిస్తాన్ వెళ్లిపో, ఫో!’ అనీ, ‘దేశాన్ని కించపరుస్తావా?’ అనీ, ‘నీసలు దేశభక్తి ఉందా?’ అనీ, ‘ఎన్ని అవమానాలు భరించినా అంబేద్కర్…