ఉ.కొరియా కొత్త నాయకుడ్ని చూస్తే ప్రపంచ దేశాలకు భయం(ట) -కార్టూన్
ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఇరవై యేడేళ్ల కిమ్ జోంగ్-యూన్ ని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మిలట్రీ అత్యున్నత సంస్ధ ఛైర్మన్ గానూ, ప్రభుత్వాధిపతి గానూ ఆయన నియమితుడు కావడం లాంఛనమే నని కొన్ని పత్రికలు చెబుతున్నా, అది అంత త్వరగా జరగకపోవచ్చు. కొత్త నాయకుడు ఇంకా పిల్లవాడేననీ, ఉత్తర కొరియా నిర్మించుకున్న అణ్వాయుధాలు ఆయన చేతిలోనే ఉన్నాయనీ, ఆయన సరదాగా పిల్లచేష్టలతో అణ్వాయుధాల…