యూరోనుండి గ్రీసు తప్పుకుంటుందని పుకార్లు, యూరో విలువ పతనం

అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు యూరోను ఉమ్మడి కరెన్సీగా రద్దు చేసుకుని స్వంత కరెన్సీ పునరుద్ధరించుకోనుందన్న పుకార్లు వ్యాపించడంతో యూరో విలువ ఒక శాతానికి పైగా పడిపోయింది. గత సంవత్సరం మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి 110 బిలియన్ యూరోల సహాయ ప్యాకేజిని అందుకున్న గ్రీసు ఆ ప్యాకేజీతో పాటు కఠినమైన షరతులను అమలు చేయాల్సి వచ్చింది. షరతుల్లో భాగంగా ప్రజలపైన భారం మోపుతూ పొదుపు విధానాలను అమలు చేయడం ప్రారంబించింది. అనేక ప్రభుత్వ…