అమెరికా నిరుద్యోగం – బలహీన ఆర్ధిక వ్యవస్ధ – కొన్ని ముఖ్యాంశాలు
అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ…