బంగారం తవ్వకాలు: స్వామీజీ కల కలే -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ స్వామీజీ శోభన్ సర్కార్ వారి 1000 టన్నుల బంగారం కల చివరికి ‘కలే’ అని తేలిపోయింది. ఉన్నావ్ తవ్వకాల్లో మట్టి తప్ప మరొకటి లేదని చెబుతూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ) వారు తవ్వకాలు నిలిపివేసి వెళ్ళిపోయారు. కొన్ని చారిత్రక పదార్ధాలు బైటపడినప్పటికి అవన్నీ 18 వ శతాబ్దం నాటివేననీ, అంతకు ముందువి ఏమీ లేవనీ ఎ.ఎస్.ఐ తేల్చేసింది. ఆ విధంగా ఎ.ఎస్.ఐ తన ఒకటిన్నర శతాబ్దాల ఘన చరిత్రను ఒక స్వామీజీ…

కేంద్ర ప్రభుత్వాన్ని పరుగెత్తిస్తున్న స్వామీజీ బంగారం కల

‘ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యి’ అన్నాట్ట. మన జియోలాజికల్ సర్వే, ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ తీరు చూడబోతే అలాగే ఉంది. ఒక ఆలయ పూజారి తనకు రాజు కలలో కనిపించి ఫలానా చోట బంగారం దాచి పెట్టానని చెప్పాడని చెప్పడంతోటే పలుగూ, పారా పట్టుకుని బయలుదేరిన జి.ఎస్.ఐ, ఎ.ఎస్.ఐ శాస్త్రవేత్తలను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాకుండా ఉంది. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కు దాదాపు 150 యేళ్ళ ఘన చరిత్ర ఉన్నది. చరిత్ర…