అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…