టి.ఆర్.ఎస్ ఏం సాధించిందని ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరుపుతోంది?

బుధవారం (ఏప్రిల్ 6) టి.ఆర్.ఎస్ కార్యవర్గం సమావేశమై ఏప్రిల్ 10 నుండి “తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు” నిర్వహించాలని నిర్ణయించిందని ఆ పార్టీ నాయకుడు కే.సి.ఆర్ ప్రకటించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నాటికి టి.ఆర్.ఎస్ పార్టీ స్ధాపించి పది సంవత్సరాలు గడిచిందనీ ఆ సందర్భంగా ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరపాలని నిశ్చయించామని ఆయన సెలవిచ్చారు. పార్టీ పెట్టి పది సంవత్సారాలు అయ్యింది గనక టి.ఆర్.ఎస్ దశాబ్ది ఉత్సావాలు జరపడంలొ అభ్యంతరం లేదు. కానీ “ఉద్యమ దశాబ్ది…