కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం
కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

