గడ్డాఫీకి ఆశ్రయం ఇవ్వడానికి మేం రెడీ -ఉగాండా
గడ్డాఫీ కోరితే ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉగాండా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆల్-అరేబియా టీవి చానెల్ ఉగాండా ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ బుధవారం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలను ఛానెల్ తెలపలేదు. మంగళవారం లండన్ లో పశ్చిమ దేశాలతో పాటు కొన్ని అరబ్ దేశాలు సమావేశమై లిబియా భవిష్యత్తు పై చర్చించాయి. లిబియాలో ఘర్షణలను ముగించడానికి వీలుగా గడాఫీ వెంటనే వేరే దేశంలో ఆశ్రయం కోరవచ్చునని మంగళవారం సమావేశం అనంతరం ఆ దేశాలు ఉమ్మడిగా ప్రకటించాయి.…