ఉక్రెయిన్ పై మొదటి వేటు వేసిన ‘పడమటి గాలి’

‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో…

రష్యాలో విలీనానికి క్రిమియా పార్లమెంటు ఆమోదం

పశ్చిమ రాజ్యాల తెరవెనుక మంతనాలను వెక్కిరిస్తూ క్రిమియా పార్లమెంటు రష్యాలో విలీనం చెందడానికి ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత (Teritorial Integrity) ను రష్యా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, ఇ.యులు ఒకవైపు రష్యాపై ఆంక్షల బెదిరింపులు కొనసాగిస్తుండగానే క్రిమియా పార్లమెంటు తన పని తాను చేసుకుపోయింది. 1954లో సోవియట్ హయాంలో ఉక్రెయిన్ కు కానుకగా ఇవ్వబడిన క్రిమియా ఇప్పుడు మళ్ళీ స్వస్ధలం చేరడానికి రంగం సిద్ధం అయింది. మార్చి 16 తేదీన జరగబోయే రిఫరెండంలో ప్రజలు…

రష్యా అనుకూల ఆక్రమణలో తూర్పు ఉక్రెయిన్

పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ప్రజా ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చివేసిన నేపధ్యంలో ఉక్రెయిన్ రష్యా, పశ్చిమ రాజ్యాల ప్రభావాల మధ్య నిలువునా చీలుతున్న భయాలు తలెత్తాయి. రష్యా అనుకూల ప్రజలు ఎక్కువగా నివసించే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో పలు పట్టణాలలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని రష్యా జెండాలను ఎగురవేస్తున్నారు. కొన్ని చోట్ల తమ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరపాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తుండగా ఉక్రెయిన్…

రష్యా అదుపులో క్రిమియా, నీతులు వల్లిస్తున్న అమెరికా

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే స్ధితికి చేరింది. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించినందుకు అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఆందోళనలు చివరికి అధ్యక్షుడు యనుకోవిచ్ ను దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి.…

ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు

యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన…

ఉక్రెయిన్: రష్యాపై ఇ.యు కక్ష సాధింపు

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేసుకోవడంతో ఇ.యు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ద్వైవార్షిక ఇ.యు-రష్యా సమావేశాలను ముక్తసరిగా ముగించడం ద్వారా తన ఆగ్రహాన్ని చాటుకుంది. రష్యా ఒత్తిడితోనే ఇ.యు లో చేరడం ఉక్రెయిన్ వాయిదా వేసుకుందని ఇ.యు ఆరోపణ. అమెరికా, ఇ.యు దేశాల పత్రికలు సైతం ఈ ఆగ్రహాన్ని దాచుకోవడం లేదు. ఉక్రెయిన్ సహజవనరులను, మార్కెట్ ను చేజిక్కించుకునే అవకాశం జారిపోయిందన్న అక్కసునంతా రష్యాపై వెళ్లగక్కుతున్నాయి. ఇ.యు, రష్యాల శిఖరాగ్ర సమావేశాలు రెండేళ్లకొకసారి…

రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేయడంతో ఇప్పుడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చి ఇ.యు లో చేరాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇ.యులో చేరడాన్ని నిరాకరిస్తున్న అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరించే మూడు ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లకు పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేయగానే అమెరికా, ఐరోపాల ప్రభుత్వాలు, పత్రికలు ‘మానవ హక్కులు’ అంటూ కాకి…

రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని గేలి చేస్తూ రష్యా మరో దౌత్య విజయం నమోదు చేసింది. ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి ‘సిరియా రసాయన ఆయుధాల వినాశనం’ ద్వారా మధ్య ప్రాచ్యం రాజకీయాల్లో అమెరికాను చావు దెబ్బ తీసిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మరో పంజా విసిరింది. తాజా పంజా దెబ్బ ఫలితంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సాపత్యం కోసం జరుపుతున్న చర్చలను సస్పెండ్ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని డిక్రీపై సంతకం చేశారు. ఉక్రెయిన్ చర్యతో వివిధ…