MH17: ఫైటర్ జెట్ గుళ్ళు పేల్చి కుల్చారు -జర్మన్ పైలట్
మలేషియా ప్రయాణీకుల విమానం MH17 ని బక్ మిసైల్ తో కూల్చారని ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా రాజ్యాలు కట్టగట్టుకుని ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఈ ఆరోపణల్లో అగ్రభాగాన నిలిచారు. ఆనక అబ్బే పొరబాటున కూల్చి ఉంటారని నాలుక మడతేశారు. కానీ బక్ మిసైల్ తోనే కూల్చారని, కూల్చడానికి తగిన పరిస్ధితులను రష్యాయే ఏర్పరిచిందని ప్రస్తుతం వాదిస్తున్నారు. కానీ జర్మనీకి చెందిన ఏవియేషన్ నిపుణుడు పీటర్ హైసెంకో జులై 30…