ఉక్రెయిన్: మరో 2 ప్రాంతాలు స్వయం పాలనకు నిర్ణయం

ఉక్రెయిన్ సంక్షోభం కొండవీటి చాంతాడు లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వయం పాలన ప్రకటించుకున్నాయి. తాము నిర్వహించిన రిఫరెండంలో ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్రంగా ఉండడానికే ప్రజలు నిర్ణయించారని దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల తిరుగుబాటు నేతలు ప్రకటించారు. రిఫరెండంను రష్యా కుట్రగా ఉక్రెయిన్ పాలకులు తిట్టి పోశారు. రిఫరెండంను వాయిదా వేయాలని రష్యా అధ్యక్షుడు కోరినప్పటికీ దానికి తిరుగుబాటుదారులు అంగీకరించలేదు. రిఫరెండం ఫలితాల నేపధ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు…

రష్యా గ్యాస్ కు ప్రత్యామ్నాయం కోసం జి7 వెతుకులాట!

అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా యూరప్ గ్యాస్ మార్కెట్ ను అమెరికా చేజిక్కించుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. రష్యా నుండి ఇన్నాళ్లూ భారీ మొత్తంలో సహజవాయువు సరఫరా పొందుతున్న ఐరోపా దేశాలకు రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా షేల్ గ్యాస్ ను ఉపయోగపెట్టుకోవడానికి నిర్ణయించే వైపుగా అడుగులు పడుతున్నాయి. రోమ్ లో మూడు రోజుల క్రితం ముగిసిన జి7 శక్తి వనరుల మంత్రుల సమావేశం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత…

ప్రొ-రష్యా అలజడులతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ -ఫోటోలు

నిన్నటి వరకు పశ్చిమ దేశాల అనుకూల ఆందోళనలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ కంటికి నిద్ర లేకుండా గడిపింది. రైట్ సెక్టార్, స్వోబోడా లాంటి మితవాద, నయా నాజీ సంస్ధలు హింసాత్మక ఆందోళనలతో యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. అంతటితో ఉక్రెయిన్ చల్లబడలేదు. ఈసారి ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఈ సారి ఆందోళనలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగానూ, ఇ.యు, అమెరికాల మద్దతు ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎక్కుపెట్టబడ్డాయి. కీవ్ ఆందోళనలకు పశ్చిమ దేశాలు…

ఉక్రెయిన్: అమెరికాకు తా చేసింది ప్రజాస్వామ్యం

‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అని మూర్ఖుల ధోరణిని వర్ణిస్తుంది ఒక సామెత. మనం చెప్పుకునేది మూర్ఖుల గురించి కాదు. ‘ఉంటే నాతో ఉండు. లేదంటే శత్రువుతో ఉన్నట్లే’ అని ప్రపంచ దేశాల్ని శాసించే అమెరికా గురించి. తాను చెప్పిందే నీతి. తన మాటే శాసనంగా చెలాయించుకునే అమెరికా ఏక నీతికి తాజా తార్కాణం ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో విక్టోరియా నూలంద్ వదరిన వాక్కులు! విక్టోరియా నూలంద్ అమెరికాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్.…

ఉక్రెయిన్ సంక్షోభం: స్వీడన్ మిలట్రీ వ్యయం పెంపు

ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడవేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు భారత పాలకులు మద్దతు ఇవ్వగా రష్యా అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. రష్యాతో శక్తి వనరుల వాణిజ్యాన్ని 2018 నాటికి మూడు రెట్లు పెంచే ఒప్పందాన్ని చైనా చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ రోజు (ఏప్రిల్ 22) ఉక్రెయిన్ సందర్శించి నాజీ పాలకులకు మద్దతు ప్రకటించాడు. సోవియట్ రష్యా పతనం తర్వాత తన మిలట్రీ ఖర్చును బాగా తగ్గించుకున్న స్వీడన్ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా…

ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…

రష్యాపై ఆంక్షలను సమర్ధించం -ఇండియా

భారత ప్రభుత్వం రష్యాకు మద్దతుగా నిలబడింది. రష్యాపై ఏకపక్ష ఆంక్షలకు తాము సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా క్రిమియాలో రష్యా ప్రయోజనాలు ఉన్నాయని గుర్తిస్తున్నామని తెలిపింది. క్రిమియా ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉన్నదనీ అదే సమయంలో ఆ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలను కూడా తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఈ ప్రకటనతో చైనా తర్వాత రష్యాకు మద్దతు ప్రకటించిన దేశాల్లో రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఇండియా, రష్యా, చైనా దేశాలు బ్రిక్స్…

ఉక్రెయిన్ సంక్షోభం -టైమ్ లైన్

ఉక్రెయిన్ సంక్షోభం కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం అయింది కాదు. ఇ.యు తో చేసుకోవాలని భావించిన ‘అసోసియేషన్ ఒప్పందం’ ను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించింది లగాయితు మొదలయిన ఆందోళనలు, సంక్షోభం నిజానికి రెండు ప్రపంచ ధృవాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోటీ. ఈ పోటీలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ కూటమి ఒకవైపు నిలబడగా రష్యా నేతృత్వంలోని యూరేసియా కూటమి మరోవైపు నిలబడి ఉంది. పాత్రధారులు ఉక్రెయిన్ ప్రజలే అయినా వారిని నడిపిస్తున్నది…