బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి
రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి…














