పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!
ఉక్రెయిన్ పై దాడిని సాకుగా చూపిస్తూ రష్యా పైన అమెరికా, ఐరోపా దేశాలు విస్తృతమైన ఆంక్షలు అమలు చేసినప్పటికీ రష్యా ఉన్నత ఆదాయ దేశంగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా ద్వారా ఈ సంగతి వెలుగు లోకి వచ్చింది. నిజానికి రష్యా 2014 వరకు ఉన్నత ఆదాయ దేశమే. మార్చి 2014 లో ఉక్రెయిన్ లో ‘యూరో మైదాన్’ పేరుతో జరిగిన ఆందోళనల నేపధ్యంలో, అప్పటి వరకు జి8 గ్రూపు దేశాల…



