అరబ్ జాతి ఒకానొక కలని సాకారం చేసుకున్నవేళ… వీడియో, కార్టూన్
మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు. పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం,…