ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం
ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది. వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం…



