ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనలో ట్రోజాన్ హార్స్ (4)

Egypt President Abdel Fattah El-Sisi with Saudi Prince Mohammed Bin Salman 3వ భాగం తరువాత…. పాన్ అరబ్బు జాతీయ ఉద్యమానికి, పాలస్తీనా విముక్తికి సిరియా, ఈజిప్టుల వ్యూహాత్మక సహకారం అత్యవసరం అని ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాజర్, సిరియా నేత హఫీజ్ ఆల్-అస్సాద్ లు సరిగ్గానే గుర్తించారు. ఇరు దేశాల సహకారాన్ని అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ సహాయంతో నివారించగలిగాయి. నాజర్ హత్య తర్వాత అన్వర్ సాదత్ నేతృత్వం లోని ఈజిప్టు…

మధ్య ప్రాచ్యం లో కీలక పరిణామం, ఇజ్రాయెల్ కి ఈజిప్టు గ్యాస్ సరఫరా రద్దు

మధ్య ప్రాచ్యం లో కొద్ది రోజుల క్రితం కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరాను ఈజిప్టు సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాదు, కేవలం కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీల వ్యవహారమేనని ఇరు ప్రహుత్వాలలోని కొన్ని వర్గాలు అంటున్నప్పటికీ, విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక సంస్కరణల’ కోసం జరిగిన తిరుగుబాటులో ఇజ్రాయెల్ కి సంవత్సరాల తరబడి అత్యంత చౌకగా…

అరబ్ జాతి ఒకానొక కలని సాకారం చేసుకున్నవేళ… వీడియో, కార్టూన్

మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు. పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో  అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం,…