ఈజిప్టు పోలీసులను చంపిన ఇజ్రాయెల్, రాయబారిని ఉపసంహరించుకుంటున్న ఈజిప్టు
ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన ప్రజా ఉద్యమం అనంతరం నియంత ముబారక్ గద్దె దిగాక ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. మిలిటెంట్లకోసం వెతుకుతూ ఈజిప్టు భూభాగంలోనికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్లన్న నెపంతో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఈజిప్టు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుని ఇజ్రాయెల్ రాయబారిని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు ఆందోళన నిర్వహించడంతో తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి విరమించుకోబోతున్నట్లుగా…