క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…

ఈజిప్టులో మళ్ళీ ఉద్యమం, పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు -ఫొటోలు

ప్రజాస్వామిక ఈజిప్టు కోసం తాము ఉద్యమించినప్పటికీ సైన్యం చొరబడి ఆధికారాన్ని హస్తగతం చేసుకుందని ఈజిప్టు ప్రజలు భావిస్తున్నారు. సైన్యం వెంటనే తప్పుకుని ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. అధికారాన్ని చేతిలో ఉంచుకున్న సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా చర్యలు తీసుకోవడం లేదనీ, తీసుకున్నా అత్యంత నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నదనీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో ఎన్జీఓ సంస్ధలకు మళ్ళీ ఉద్యమాలకు దిగక తప్పలేదు. క్రమంగా ఎన్జీఓ సంస్ధల చేతుల్లోనుండి…

ఇజ్రాయెల్ ఎంబసీపై ఈజిప్షియన్ల దాడి, దేశం విడిచిపోయిన రాయబారి

ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తామే, తాత్కాలికంగానే అయినా, తెంచేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై పెద్ద సంఖ్యలో దాడి చేసిన ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ జెండాను కూలగొట్టి, రాయబార కార్యాలయంలోపలికి జొరబడ్డారు. లోపల ఉన్న ఫర్నిచర్, రికార్డులు అన్నింటినీ ధ్వంసం చేశారు. దానితో ఇజ్రాయెల్ రాయబారి ఈజిప్టు విడిచి కుటుంబంతో సహా స్వదేశం వెళ్ళిపోయాడు. గత నెలలో ఈజిప్టు సరిహద్దు భద్రతా దళాల పోలీసులను ఇజ్రాయెల్ సైనికులు చంపినందుకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటానని…