యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాం -ఎస్ & పి హెచ్చరిక

యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.…