గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం
“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్ ఇవ్వడానికి…