ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్
గ్రీసు, ఐర్లండ్ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో…