ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్
అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…