ఇవాన్పా, అమెరికా: సోలార్ విద్యుత్ యజ్ఞం -ఫోటోలు

సూర్య రశ్మి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం పైన 19వ శతాబ్దం చివరి నుండే ప్రయోగాలు మొదలయ్యాయి. అప్పట్లో ఈ విషయాన్ని మొదట విన్నపుడు చాలామంది నవ్వారు. ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లు… ఇప్పుడు సోలార్ విద్యుత్తు అద్భుతాలు సృష్టిస్తోంది. ధర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ తదితర శిలాజ ఇంధనం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తు… ఇవన్నీ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తూ భూగోళం వేడెక్కడానికీ, తద్వారా విపరీత ప్రకృతి ఉత్పాతాలకు…