మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది. వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. “రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు…
