నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి…