డ్రోన్ దాడిలో సీనియర్ ఆల్-ఖైదా నేత ఇలియాస్ కాశ్మీరీ మరణం?
పాకిస్ధాన్ ప్రభుత్వ కోవర్టు మద్దతుతో అమెరికా మానవ రహిత విమానం డ్రోన్ దాడిలో సీనియర్ ఆల్-ఖైదా నాయకుడు ఇలియాస్ కాశ్మీరీ మరణించాడు. ఒసామా హత్యానంతరం అమెరికా సాధించిన ప్రధాన టార్గెట్ గా ఇలియాస్ మరణాన్ని చెప్పుకోవచ్చు. పశ్చిమ దేశాలు “ఇలియాస్ కాశ్మీరీ” ని చాలా ప్రమాదకరమైన టెర్రరిస్టుగా అభివర్ణిస్తాయి. తద్వారా అమెరికా తదితర నాటో సైన్యాలకు నష్టాలు కలిగించడంలో కాశ్మీరీ పాత్ర స్పష్టం అవుతోంది. పాకిస్ధాన్ లోని ఓ గూఢచర్య అధికారిని, స్ధానిక టివి రిపోర్టులను ఉటంకిస్తూ…