ఇరాన్, వెనిజులా సంబంధాలపై మితవాదుల అనుమానాలు -కార్టూన్

ఆర్ధిక సూత్రాలకు సంబంధించినంతవరకూ మితవాదులంటే ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ సౌకర్యాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలని గుదిబండలని చెబుతూ ప్రవేటోళ్ళకి అమ్మేయాలనడం, ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వనవసరం లేదనడం, ఒక పద్ధతిలో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించుకోవడాన్ని తిరస్కరిస్తూ అంతా మార్కెట్లో ఉండే ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధల ఇష్టాయిష్టాలకి వదిలేయాలని ప్రభోధించడం. ఒక్క ముక్కలో చెప్పాలంటె మితవాదం ప్రజల సుఖ సంతోషాలకు వ్యతిరేకం, కోటీశ్వరులు లేదా బిలియనీర్ల ధనదాహానికి అనుకూలం. చూశారా, చూశారా! ఇరాన్ ఇచ్చిన…

మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్

“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…