ఇరాన్ పై బాంబు పడాల్సిందే -కార్టూన్
ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటుందేమోనన్న భయంతో వణికిపోతున్న ఇజ్రాయెల్ అమెరికా చేత ఇరాన్ యుద్ధం చేయించడానికి కంకణం కట్టుకుని ఉంది. అమెరికాలో అత్యంత శక్తివంతమైన ‘ఇజ్రాయెల్ అనుకూల యూదు లాబీ’ ద్వారా అమెరికా చేత అనేక ఘోరాలు చేయించిన ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ పైన కత్తి కట్టింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ, పాలస్తీనీయులపై జాత్యహంకార పాలన సాగిస్తూ మూడొందలకు పైగా అణు బాంబులు (బిబిసి ప్రకారం) నిర్మించుకుని ఉన్న ఇజ్రాయెల్ వల్ల ‘ప్రపంచ…
