ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?
అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…