సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్
ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు…