ఇరాన్ ఆయిల్ కొనుగోలు పెంచిన టర్కీ

ఇరాన్ నుండి కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మొత్తాన్ని టర్కీ అధికం చేసింది. ఇరాన్ తయారు చేయని అణు బాంబు ప్రపంచ శాంతికి ప్రమాదం అని చెబుతూ ఆదేశానికి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ చట్టం చేసి తమ చట్టాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్న అమెరికాకి టర్కీ ఈ విధంగా సమాధానం చెప్పింది. ఫిబ్రవరి తో పోలిస్తే మార్చి నెలలో ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని…

భారత దేశానికి ఆయిల్ సరఫరాలో ఆటంకాలు రానివ్వం -ఇరాన్

భారత దేశ ఆయిల్ రిఫైనరీలు పాత బాకీలు చెల్లించనట్లయితే వాటికి ఆయిల్ సరఫరాను ఆగష్టు నెలనుండి బంద్ చేస్తామని ప్రకటించిన ఇరానియన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ “నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ” (ఎన్.ఐ.ఒ.సి), భారత దేశానికి సరఫరా చేయడంలో ఆటంకాలు రానివ్వబోమని ప్రకటించింది. ఇండియా ఆయిల్ రిఫైనరీలు తమకు 2 బిలియన్ డాలర్లు బకాయి ఉన్నాయనీ అది చెల్లించడానికి తగిన మార్గాన్ని త్వరగా చూపనట్లయితే ఆయిల్ సరఫరా ఆపడం తప్ప మరొక మార్గం లేదని ఎన్.ఐ.ఒ.సి ప్రకటించిన…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…