ఇరాక్ విధ్వంసంతో అమెరికా సంతృప్తి, అందుకే సైన్యం ఉపసంహరణ -కార్టూన్
దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా ఇరాక్ లో అమెరికా సైన్యం తిష్ట వేసింది. ఒక దేశాన్ని, ఒక ప్రజా సమూహాన్ని ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగానూ ఇరాక్ ను అది విధ్వంసం కావించింది. ప్రజల నిత్యజీవనానికి అవసరమైన మౌలిక నిర్మాణాలన్నింటినీ -రోడ్లు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సౌకర్యం, రైలు మార్గాలు, ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ సరఫరా మార్గాలు మొ॥వి౦- సర్వనాశనం చేసింది. తాను స్ధాపిస్తానన్న ప్రజాస్వామ్యం ఊసుని పూర్తిగా విస్మరించింది. ప్రశాంతంగా బతుకుతున్న ఇరాకీయుల మధ్య, జాతి,…