ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!
ఇరాక్ లో అమెరికా యుద్ధం పూర్తయ్యిందట. అలా అని అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. ఇరాక్ లో అమెరికా పని పూర్తయినందున ఈ సంవత్సరాంతానికి అక్కడనుండి అమెరికా సైన్యాలన్ని వెనక్కి వస్తాయి అని ఆయన ప్రకటించాడు. “అమెరికా సైనికులు తల ఎత్తుకుని, తమ విజయాన్ని చూసి గర్వపడుతూ, సైన్యానికి మద్దతు ఇవ్వడం కోసం అమెరికా ప్రజలంతా సమైక్యంగా నిలబడి ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి ఇరాక్ ని వదిలి ఇళ్ళకు చేరుకుంటారు” అని ఒబామా ప్రకటించాడు.…