గిలానీ ప్రధాని పదవికి అనర్హుడు, పాక్ సుప్రీం కోర్టు సంచల తీర్పు
పాకిస్ధాన్ మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ఆధికారాల కోసం జరుగుతున్న ఘర్షణలో తాజా అంకానికి తెర లేచింది. ప్రధాని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితం సుప్రీం తీర్పు చెప్పిన నేపధ్యంలో ప్రధాన మంత్రి గిలానీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినట్లేననీ, కనుక గిలానీ పదవి నుండి దిగిపోవాల్సిందేనని సంచల రీతిలో తీర్పు ప్రకటించింది. ప్రధానిని పదవి నుండి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందనీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనలను…
