ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ
దేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి…

