ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు
ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…




