ఇజ్రాయెల్ వెబ్‌సైట్లపై ‘ఎనోనిమస్’ సైబర్ దాడులు, నిరాకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఆర్మీ లతో పాటు వివిధ ప్రభుత్వ వెబ్ సైట్లపైన సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ‘ఎనోనిమస్’ సంస్ధ ప్రకటించిన రెండు రోజుల్లోనే సదర్ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ రూపొందించడంలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురైతే ఆ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైట్లను ఎవరూ హ్యాక్ చెయ్యలేదనీ, కొన్ని సమస్యలవలన మాత్రమే తాత్కాలికంగా…