‘ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ నాశనం’, రెండేళ్ళ క్రితమే హెచ్చరించిన అమెరికా
తన మూర్ఖ పద్ధతులను మార్చుకోకపోతే మరో ఇరవై ఏళ్లలో ఇజ్రాయెల్ ఒక దేశంగా అంతరించడం ఖాయమని అమెరికా రెండేళ్ల క్రితమే హెచ్చరించింది. ఈజిప్టు, ట్యునీషీయా తిరుగుబాట్లగురించి రెండేళ్ల క్రితం అసలు ఊహించనైనా సాధ్యం కాదు. అటువంటి పరిస్ధుతుల్లోనే అమెరికా ఇటువంటి హెచ్చరిక చేసిందంటే గత తొమ్మిది నెలలుగా అరబ్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ అంతానికి ఇరవై సంవత్సరాలు కూడా అవసరం లేదేమో! ఒబామా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన మూడు వారాల తర్వాత జనవరి 2009లో…