ఇజ్రాయెల్ ఎంబసీపై ఈజిప్షియన్ల దాడి, దేశం విడిచిపోయిన రాయబారి

ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తామే, తాత్కాలికంగానే అయినా, తెంచేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై పెద్ద సంఖ్యలో దాడి చేసిన ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ జెండాను కూలగొట్టి, రాయబార కార్యాలయంలోపలికి జొరబడ్డారు. లోపల ఉన్న ఫర్నిచర్, రికార్డులు అన్నింటినీ ధ్వంసం చేశారు. దానితో ఇజ్రాయెల్ రాయబారి ఈజిప్టు విడిచి కుటుంబంతో సహా స్వదేశం వెళ్ళిపోయాడు. గత నెలలో ఈజిప్టు సరిహద్దు భద్రతా దళాల పోలీసులను ఇజ్రాయెల్ సైనికులు చంపినందుకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటానని…