ఇంద్రధనుస్సు పారిపోయి నీటి మడుగున దాగిందా?

పుడమి వేడికి తల్లడిల్లిన ఇంధ్ర ధనుస్సు ఓజోన్ గొడుగు లేక నీటి మడుగున దాగిందా? నీటి మడుగున దాగిన ఇంద్రచాపం రంగుల వేళ్ళు చాచి ఊపిరి కోసం ఉపరితలాన్ని చేరుతోందా? నీటి గర్భం చీల్చుకున్న రంగుల ఉమ్మనీరు కొత్త ఊపిరి రాకను చాటుతోందా? హ్రదయ జలధిని వీడిన భావ తరంగం ఆనంద నాట్యంతో అంచులు దాటి పొర్లుతోందా? గుండె గుండం పేలిపోయి విలయ గండం ప్రకటిస్తోందా? జ్ఞానం కూరిన మెదడు మందుగుండు హాఛ్ మని తుమ్మిందా? దీర్ఘ…