జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం మరింత పై పైకి…

భారత దేశంలో నిత్యావసర సరుకులు, వినియోగ సరులులతో పాటు సమస్త వస్తువల ధరలు పెరగడం కొనసాగుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం ఇంకా పెరగడంతో పాటు ఏప్రిల్ నెలలో కూడా గతంలో ప్రకటించిన అంకెను ప్రభుత్వం మరింతగా పైకి సవరించుకుంది. అంటే ఏప్రిల్ నెలలో ధరలు గతంలో భావించినదాని కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట. జూన్ నెలలో (ప్రధాన) ద్రవ్యోల్బణం 9.44 శాతం నమోదయ్యింది. టోకు ధరల సూచి ప్రకారం లెక్కించే ప్రధాన…

ఇంధన ద్రవ్యోల్బణం పైపైకి, మళ్ళీ రెండంకెలకు చేరనున్న ప్రధాన ద్రవ్యోల్బణం?

డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది. జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి…

ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…

భారత్ ను భయపెడుతున్న ఆహార, ఆయిల్ ద్రవ్యోల్బణాలు

భారత దేశానికి ద్రవ్యోల్బణం బెడద మరో సంవత్సరం తప్పేట్టు లేదు. జి.డి.పి వృద్ధి రేటులో చైనా తర్వాత అత్యధిక వేగవంతమైన పెరుగుదలను నమోదు చేస్తున్న ఇండియాకు ద్రవ్యోల్బణం గత ఒకటిన్నర సంవత్సరం నుండి వెంటాడుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఆయిల్ (ఇంధనం) ద్రవ్యోల్బణంలు ఏప్రిల్ 9 తేదితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పెరుగుదలను నమోదు చేసాయి. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఎనిమిది సార్లు బ్యాంకు రేట్లను పెంచింది. మార్చితో ముగిసే…