మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…