కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు

ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…