డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్
త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది. పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి),…