ఇండియా, పాక్ సీజ్ ఫైర్ మరియు ట్రంప్ అను విచిత్ర గాధ!
ఇండియా, పాకీస్థాన్ దేశాల సైన్యం, పహల్గామ్ పై జరిగిన దాడి దరిమిలా పరస్పరం 4 రోజుల పాటు మిసైళ్లు, జెట్ ఫైటర్లు, డ్రోన్ లతో యుద్ధం చేస్తూ అకస్మాత్తుగా “కాల్పుల విరమణ” ప్రకటించటం వెనుక కారణం ఏమిటి? ఇండియా, పాకీస్థాన్ దేశాల ప్రభుత్వాలు కాల్పుల విరమణకు నిర్ణయించాయా? లేక భారత ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నట్లు ఇరు దేశాల మిలటరీలు నిర్ణయించాయా? లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూరున్నొక్క సార్లు అలుపు సొలుపు లేకుండా డప్పు…


