భారత్ అణు కార్యక్రమంపై అమెరికా కన్ను పడింది

‘రంగు పడుద్ది!’ అని ఏదో సినిమాలో కామెడీ విలన్ ఏ.వి.యస్ అంటారు(ట)! బహుశా (కత్తితో పొడిచి) హత్య చేస్తే ఎర్రటి రక్తం చిందుతుంది గనుక రక్తం కారుద్ది అనడాన్ని విలన్ చేత ఆ విధంగా చెప్పించి ఉండాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా కన్ను పడినా దాదాపు అదే పరిస్ధితి. అమెరికా కన్ను పడిన ఏ దేశమూ ఇంతవరకూ బతికి బట్టకట్టింది లేదు, ఒక్క ఇజ్రాయెల్ తప్ప. ఇజ్రాయెల్ ఒక్కోసారి అమెరికాను మించిన దిగజారుడుని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్…