గత ఆరు క్వార్టర్‌లలో అతి తక్కువ నమోదైన భారత జిడిపి
2011-12 ఆర్ధిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్ నెలలు) భారత దేశ జి.డి.పి నిరాశపరిచింది. గత ఆరు క్వార్టర్లలో, అంటే గత సంవత్సరం న్నర కాలంలో అత్యంత తక్కువగా 7.7 శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. అయితే ఆర్ధిక పరిశీలకులు, భారత జిడిపి మొదటి క్వార్టర్ లో ఇంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కనుక మార్కెట్ అంచనాలను అధిగమించిందన్న సంతోషాన్ని ఈ అంకెలు మిగిలించాయి. గత మార్చి క్వార్టర్…