సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణకు ఇండియా, చైనా అంగీకారం!

Nathu-La pass ఇండియా, చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించటానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల వాణిజ్యం అనేక శతాబ్దాలుగా, ప్రధానంగా లెజెండరీ స్థాయి సంపాదించిన సిల్క్ రోడ్ ద్వారా కొనసాగుతూ వస్తున్నది. మోడి ప్రభుత్వం హయాంలో వరుస పెట్టి ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వద్ద అనేక హింసాత్మక ఘర్షణలు చెలరేగిన దరిమిలా సరిహద్దు వాణిజ్యం నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. కోవిడ్ 19 వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిందని…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా

చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది. భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది.…